అయోధ్య
బాలరాముడికి మధ్యప్రదేశ్‌కు చెందిన శివ బరాత్ జన్ కళ్యాణ్ సమితి బృందం 1,100 కిలోల ఢమరుకాన్ని కానుకగా అందజేసింది.
ఈ తబలాను వాయించినప్పుడు శబ్దం కొన్ని
కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ఈ వాయిద్య పరికరానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్
రికార్డ్స్‌లో కూడా చోటు దక్కింది.
6
అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పు కలిగిన ఈ వాయిద్యాన్ని
ప్రత్యేకంగా తయారు చేయించారు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన కొందరు రామ భక్తులు
6.9 అడుగుల ప్లైవుడ్‌పై హనుమాన్ చాలీసాను
చెక్కారు. అనంతరం అయోధ్యకు తీసుకువచ్చి శ్రీరామ
జన్మభూమి ట్రస్ట్ సభ్యులకు అందజేశారు.