సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్పపై లైంగిక వేధింపుల కింద కేసు నమోదైంది. 17 సంవత్సరాల మైనర్ బాలికపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు యడియూరప్పపై పోక్సో కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం. మోసం వ్యవహారంలో తమకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ, ఆమె కుమార్తె గత నెల 2న యడియూరప్పను కలిశారు.ఆ సమయంలో యడియూరప్ప బాలికను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు అందించగా, వారు కేసు నమోదు చేశారు.
దీనిపై యడియూరప్ప స్పందించాల్సి ఉంది. ఆయన కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. గతంలో కూడా ఆ మహిళ ఇలాంటి ఫిర్యాదులు చాలా చేసిందని వారు గుర్తు చేశారు. ఆమె ఇలాంటి ఫిర్యాదులు గతంలో 53 చేసినట్లు చెప్పారు.
కర్ణాటకలో నాలుగుసార్లు సీఎంగా చేసిన యడియూరప్ప, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా చేశారు. నాలుగు నెలల కిందట యడియూరప్ప కుమారుడు విజయేంద్రను కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ప్రస్తుతం యడియూరప్ప బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబరుగా ఉన్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు