ప్రస్తుత
ఏడాదిలో సమృద్ధిగా వానలు పడతాయని వాతావరణ
శాఖకు చెందిన శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2023లో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావానికి కారణమైన ఎల్నినో
పరిస్థితులల్లో మార్పులు సంభవిస్తాయని తద్వారా వర్షాలు కురుస్తాయని
భావిస్తున్నారు.
నైరుతి రుతుపవనాలు దేశంలో
ప్రవేశించే సమయానికి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని అమెరికా, భారత్కు చెందిన వాతావరణ
సైంటిస్టులు ఆశిస్తున్నారు.
పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడంతో
ఏర్పడిన ఎల్నినో, జూన్ నాటికి బలహీనపడి ‘లానినా’ ఏర్పడుతుందని అమెరికాకు చెందిన
క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్, నేషనల్ వెదర్ సర్వీస్ అంచనా వేశాయి.
ఎల్నినో
ఏప్రిల్-జూన్ మధ్య తటస్థ స్థితికి వచ్చేందుకు
83 శాతం అవకాశం ఉండగా జూన్-ఆగస్టు మధ్య
లానినాగా మారడానికి 62 శాతం అవకాశముంది.
లా నినా పరిస్థితులు ఏర్పడితే నైరుతి రుతుపవనాల
సమయంలో దేశంలో సాధారణవర్షపాతం నమోదవుతుంది. తటస్థ పరిస్థితులు ఏర్పడినా వర్షాలకు
ఢోకా ఉండదని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ మాధవన్ రాజీవన్
తెలిపారు.
జీడీపీలో 14 శాతం
వాటా కలిగిన వ్యవసాయరంగానికి నైరుతి రుతుపవనాలే కీలకం. భారత్లో 70 శాతం వార్షిక వర్షపాతం నైరుతి రుతుపవనాల కారణంగానే
నమోదు అవుతుంది.