రాజ్యసభ ఎంపీగా సామాజిక సేవకురాలు
సుధామూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపక చైర్మన్ నారాయణమూర్తి
సతీమణి సుధామూర్తిని మహిళాదినోత్సవం రోజు రాజ్యసభ ఎంపీగా కేంద్రం నామినేట్
చేసింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఛాంబర్ లో భర్త నారాయణమూర్తి సమక్షంలో
ఆమె నేడు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా
వ్యవహరించడంతో చిన్నారుల కోసం పలు పుస్తకాలు రాశారు. కన్నడ, ఇంగ్లిష్ సాహిత్యాభివృద్ధికి ఆమె చేసిన కృషికి
గాను సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం కూడా వరించింది. 2006లో పద్మశ్రీ, 2023లో పద్మ భూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం
గౌరవించింది.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడం
సంతోషంగా ఉందన్న సుధా మూర్తి, పేదల అభ్యున్నతి కోసం పనిచేసేందుకు అతిపెద్ద వేదిక
దొరికిందన్నారు. రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్
అవడంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు.
సుధామూర్తి-నారాయణమూర్తి దంపతులకు ఓ
కుమార్తె, కుమారుడు సంతానం. కుమార్తె అక్షత మూర్తి భర్త రిషి సునాక్, ఇంగ్లండ్
ప్రధాన మంత్రిగా ఉన్నారు. రిషి సునాక్ పూర్వీకులు భారత్ నుంచి ఇంగ్లాండ్ వలస
వెళ్ళారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు