ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీఎంసీ కీలక నేత, బర్రక్పూర్ ఎంపీ అర్జున్ సింగ్ బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు.అయితే బీజేపీలో ఎప్పుడు చేరే విషయం మాత్రం చెప్పలేదు. ఢిల్లీలో కాని, బెంగాల్లో కాని నేను బీజేపీలో చేరతాను. ఇది గ్యారంటీ, నేను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని అర్జున్ సింగ్ మీడియాకు స్పష్టం చేశారు.
టీఎంసీలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని అర్జున్ సింగ్ విమర్శలు చేశారు. ప్రజలే దీనికి సమాధానం చెబుతారని అభిప్రాయపడ్డారు. బర్రక్పూర్ టీఎంసీ ఎంపీ అభ్యర్థిగా పార్థ బౌమిక్ను ప్రకటించింది.
నేను బీజేపీ నుంచే వచ్చాను, మరలా మా పార్టీకి వెళుతున్నానని అర్జున్ సింగ్ తెలిపారు. టీఎంసీ మొత్తం 42 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో అర్జున్ సింగ్కు సీటు దక్కకపోవడంతో ఆయన పార్టీ మారనున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.తాజాగా అర్జున్ సింగ్ స్వయంగా ప్రకటించడంతో పుకార్లకు తెరపడినట్లైంది.