ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ జారీ చేసిన సమన్లను సీఎం కేజ్రీవాల్ సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. ఈ కుంభకోణంలో రెండో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మార్చి 16కల్లా ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని గత వారం ఈడీ సమన్లు జారీ సింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్‌పై సీఆర్పీసీ సెక్షన్ 190 (1)(ఏ) 200, 1973 (ఆర్) (W), 174 ఐపీసీ, 1860 (ఆర్) (డబ్ల్యూ) 64 4, పీఎంఎల్ఏ, 2002 నాన్ అటెండెన్స్ సెక్షన్ 50 కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసు విచారణలో కేజ్రీవాల్ వర్చువల్‌గా ఈడీ ముందు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలు, విశ్వాస పరీక్ష ఉండటం వల్ల తాను భౌతికంగా కోర్టుకు హాజరుకాలేనని, ఆన్లైన్ ద్వారా మాత్రమే హాజరు కాగలనని గత నెలలో కేజ్రీవాల్ కోర్టుకు విన్నవించారు. గత నెలలో కేజ్రీవాల్ వర్చువల్‌గా ఈడీ ముందు హాజరయ్యేందుకు కోర్టు అనుమతించింది. గత వారం ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 16లోపు కేజ్రీవాల్ భౌతికంగా ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంది. ఇవాళ సెషన్స్ కోర్టు తీర్పు ఆధారంగా, కేజ్రీవాల్ రేపు ఈడీ ముందు హాజరవుతారా? లేదా అనే విషయం తేలనుంది.