ఇసుకు
మాఫియా కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు ఏకకాలంలో మూడురాష్ట్రాల్లోని 13
ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఇసుక
మాఫియా కేసులో ఉత్తరప్రదేశ్ కు చెందిన మాజీమంత్రి గాయత్రి ప్రజాపతి పాత్రపై ఆరా
తీస్తున్న ఈడీ, దిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో తనిఖీలు చేపట్టింది.
గాయత్రి
ప్రజాపతి, అతడి భార్య, కుమారుడు పేరిట ఉన్న సంస్థల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
లక్నో, అమేతి, ముంబై, దిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.
మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద స్థానిక పోలీసుల
సాయంతో కేసును ఈడీ విచారిస్తోంది.
ఇసుక
మాఫియా అరాచకాలపై ఉత్తరప్రదేశ్ విజిలెన్స్ శాఖ, గాయత్రి ప్రజాపతి అతని అనుచరుల
పాత్ర పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అక్రమంగా ఇసుక రవాణా చేయడంతో పాటు ఆదాయానికి
మించి అక్రమఆస్తులు కూడబెట్టారని ఎఫ్ఆర్ఐ లో విజిలెన్స్ శాఖ పేర్కొంది.
గాయత్రి
ప్రజాపతి, మంత్రిగా ఉన్న సమయంలో అధికారులను ప్రలోభపెట్టి, బెదిరించి అక్రమాస్తులు
కూడబెట్టారని ఈడీ విచారణలో తేలింది. అక్రమార్జనను కుటుంబసభ్యులు, సన్నిహితుల పేరిట
దాచారని ఈడీ ఆరోపిస్తోంది. ఆదాయానికి అర్జనకు పొంతన లేకుండా ఆస్తులు అనుహ్యంగా
పెరగడంపై ఈడీ విచారణ చేస్తోంది.
కుటుంబ
సభ్యుల బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమార్జనను దారి మళ్ళించినట్లు దర్యాప్తులో
తేలింది.
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంలో
గాయత్రి ప్రజాపతి మైనింగ్ మంత్రిగా వ్యవహరించారు.