ED
raids on various places in land grabbing case on Sheikh Shahjahan
పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో
పలు ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షేక్ షాజహాన్ మీద నమోదైన భూ ఆక్రమణల కేసు విచారణలో
భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఈడీ, కేంద్ర బలగాలతో
సమన్వయంతో ఈ సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ సోదా చేస్తున్న స్థలాలన్నీ ఈ కేసులో నిందితుల
నివాస గృహాలే.
కొద్దిరోజుల క్రితమే షేక్
షాజహాన్‌ను పోలీసులు అరెస్టు చేసారు. షాజహాన్ మీద భూ దురాక్రమణల కేసులతో పాటు
సందేశ్‌ఖాలీలో హిందూ మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన దుర్వ్యవహారంలోనూ కేసులు
నమోదయ్యాయి. వాటి ఆధారంగా ఫిబ్రవరి 29న అతన్ని అరెస్ట్ చేసారు.
ఈ కేసుకు సంబంధించి ఈడీ
ఫిబ్రవరి 23న ఆరేడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అంతకుముందు జనవరి 5న సోదాల
కోసం ఈడీ అధికారులు సందేశ్‌ఖాలీ వెళ్ళడానికి ప్రయత్నించగా, షాజహాన్, అతని టీఎంసీ
గూండాలు ఈడీ అధికారులను చితగ్గొట్టారు. ఆ సమయంలోనే సందేశ్‌ఖాలీలో మహిళలపై సామూహిక
అత్యాచారాల ఘటనలు వెలుగు చూసాయి,