దొంగలు చేసిన పనికి పోలీసులే షాకయ్యారు. కారులో వచ్చి ఏటీఎంలో సీసీ కెమెరాలకు స్ప్రే చేసి రూ.25 లక్షలు ( sbi atm steal) కాజేసింది ఓ ముఠా. వారు దొంగతనం చేసిన తీరు పరిశీలించిన పోలీసులు ఖంగు తిన్నారు. ఏటీఎం చోరీ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ బస్టాండ్ వద్ద ఎస్బీఐ ఏటీఎం ఉంది. బుధవారం రాత్రి నలుగురు దుండగులు కారులో దిగారు. అందులో ఓ వ్యక్తి సీసీ కెమెరాలకు స్ప్రే చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన దొంగలు క్షణాల్లో ఏటీఎం ధ్వంసం చేశారు. అందులోని రూ.25 లక్షలు తీసుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం వేట కొనసాగిస్తున్నారు.క్లూస్ టీం దొంగతనం జరిగిన తీసును పరిశీలించారు. ఉత్తరాది రాష్ట్రాల దొంగల పనిగా అనుమానిస్తున్నారు.