ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్‌ను మరో పదేళ్లు
ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
ఈ ఏడాది జూన్ 2 తో విభజన చట్టంలో
పేర్కొన్న పదేళ్ళ ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తున్నందున పొడిగించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
ఈ వ్యవహారంపై చట్టం చేయాలని తాము పార్లమెంట్‌ను
ఎలా ఆదేశించగలమని న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నించింది.
న్యాయస్థానానికి కొన్ని పరిమితులు
ఉంటాయన్న ధర్మాసనం, ఆదేశాలివ్వడం పిల్ వేసినంత సులువు కాదని స్పష్టం చేసింది.
హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్
ఠాకుర్, జస్టిస్ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ
పిటిషన్ ను విచారించింది.
ఏపీ విభజన చట్టంలోని నిబంధనల మేరకు
ఆస్తులు, అప్పుల ప్రక్రియ పూర్తి కానందున హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి
రాజధానిగా పొడిగించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ
సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్‌కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యవహారంపై
చట్టం చేసేలా తాము పార్లమెంట్‌ను ఏలా ఆదేశించగలమని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం
ప్రశ్నించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు