BJP second list with 72 candidates’ names for LS polls
త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా
పార్టీ 72మంది అభ్యర్ధుల పేర్లతో తమ పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. ఈ
జాబితాలో నలుగురు కేంద్రమంత్రులు, ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. తెలంగాణ
రాష్ట్రంలో మరో ఆరుగురు అభ్యర్ధులను ఈ జాబితాలో ప్రకటించారు.
కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్,
పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషీలు బీజేపీ రెండో జాబితాలో చోటు దక్కించుకున్నారు.
అలాగే మాజీ ముఖ్యమంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, త్రివేంద్రసింగ్ రావత్, బసవరాజ్
బొమ్మైల అభ్యర్ధిత్వాలు ఖరారయ్యాయి.
నిన్ననే, అంటే మంగళవారం నాడే, హర్యానా ముఖ్యమంత్రి
పదవికి రాజీనామా చేసిన మనోహర్‌లాల్ ఖట్టర్ కర్నాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ
చేస్తారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హావేరి నియోజకవర్గం నుంచి
బరిలోకి దిగుతారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ హరిద్వార్‌నుంచి
పోటీపడతారు.
కేంద్రమంత్రుల సంగతి చూస్తే… నితిన్ గడ్కరీ
మహారాష్ట్రలోని నాగపూర్‌నుంచి పోటీ చేస్తారు. పీయూష్
గోయల్ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. అనురాగ్
ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారు. ప్రహ్లాద్
జోషి కర్ణాటకలోని ధార్వాడ నుంచి పోటీ పడతారు.
హిమాచల్ ఫ్రదేశ్లోని సిమ్లా నియోజకవర్గం నుంచి
సురేష్ కాశ్యప్ పోటీ చేస్తారు. కర్ణాటకలోని బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి
తేజస్వి సూర్య, బెంగళూరు సెంట్రల్ నుంచి పీసీ మోహన్ పోటీ చేస్తారు. మహారాష్ట్రలోని
బీడ్ నుంచి పంకజా ముండే, ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ నుంచి అనిల్ బలూనీ బరిలోకి
దిగుతారు.
దేశ రాజధానిలో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి
హర్ష్ మల్హోత్రా, వాయవ్య ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియా పోటీ చేస్తారు. దాద్రా
నగర్ హవేలీ నుంచి కళాబెన్ దేల్కర్ పోటీపడతారు.
ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో ఏడు
స్థానాల అభ్యర్ధులను ప్రకటించారు. అహ్మదాబాద్ తూర్పు నుంచి హస్ముఖ్భాయ్ సోమాభాయ్
పటేల్, వల్సాడ్ నుంచి ధవళ్ పటేల్, సూరత్ నుంచి ముఖేష్‌భాయ్ చంద్రకాంత్ దలాల్,
వడోదర నుంచి రంజన్‌బెన్ ధనంజయ్ భట్, భావనగర్ నుంచి నిమూబెన్ బంభానియా, సబర్కాంత
నుంచి భిఖాజీ దూధాజీ ఠాకోర్, ఛోటా ఉదయ్‌పూర్ నుంచి జషూభాయ్ భిలూభాయ్ రథవా పోటీ
చేస్తారు.
హర్యానా నుంచి ఖట్టర్ కాకుండా మరో ఐదుగురిని
ప్రకటించారు. అంబాలా నుంచి బంటో కటారియా, సిర్సా నుంచి అశోక్ తన్వర్,
భివానీ-మహేందర్‌గఢ్ నుంచి ధరమ్‌బీర్ సింగ్, గుర్గావ్ నుంచి రావ్ ఇందర్జిత్ సింగ్
యాదవ్, ఫరీదాబాద్ నుంచి కిషన్‌పాల్ గుర్జర్ లోక్‌సభ బరిలోకి దిగుతారు.
కర్ణాటకలో షిమోగా నుంచి రాఘవేంద్ర, తుమకూరు నుంచి
వి సోమన్న పోటీ పడతారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆరుగురి పేర్లు
ప్రకటించారు. మెదక్ నుంచి రఘునందన్‌రావు, మహబూబ్‌నగర్ నుంచి డికె అరుణ, నల్లగొండ
నుంచి సైదిరెడ్డి, ఆదిలాబాద్ నుంచి గోడెం నగేష్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్,
మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ పోటీ చేస్తారు.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి.
వాటిలో 9 సీట్లకు మొదటి జాబితాలో అభ్యర్ధులను ప్రకటించారు. రెండో జాబితాలో 6
స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. ఇంక ఖమ్మం, వరంగల్ స్థానాలు పెండింగ్‌లో
ఉన్నాయి.
బీజేపీ తమ మొదటి జాబితాలో
195 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించింది. రెండో జాబితాలో 72మంది పేర్లను
ప్రకటించింది. దీంతో ఇప్పటికి 267మంది అభ్యర్ధుల పేర్లు ఖరారయ్యాయి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు