మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్
పేరును అహల్యానగర్‌గా మారుస్తూ ఆ రాష్ట్రమంత్రివర్గం ఉత్తర్వులు జారీ చేసింది. మరాఠా రాణి అహల్యాభాయ్
హోల్కర్ పేరుతో అహ్మద్‌నగర్‌ను ఇక నుంచి పిలవాలనే ప్రతిపాదనకు మహారాష్ట్ర
ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
అహ్మద్‌నగర్ పేరు మార్చాలని మహారాష్ట్ర
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గత ఏడాది మేలో ప్రతిపాదించారు.
18 శతబ్దానికి చెందిన
రాణి అహల్యా భాయ్ 298వ జయంతి సందర్భంగా షిండే ఈ ప్రకటన చేశారు.
నిజాంషాహి వంశానికి చెందిన అహ్మద్
నిజాంషా పేరుతో 15వ శతాబ్దంలో ఈ నగరానికి అహ్మద్‌నగర్ గా
నామకరణం చేశారు.
2022లో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను శంభాజీనగర్, ధారాశివ్‌గా
మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.