ఉత్తరాఖండ్ శాసనసభ ఆమోదించిన యూనిఫామ్
సివిల్ కోడ్ (UCC) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్
ప్రభుత్వం యూసీసీ ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు.
నేడు, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో యూసీసీ బిల్లు చట్ట రూపం దాల్చింది.
వివాహం, విడాకులు, వారసత్వ హక్కుల విషయంలో మతపరమైన చట్టాలకు బదులు యూసీసీ ని అమలు
చేస్తారు.
యూసీసీ అమలవుతున్న మొదటి రాష్ట్రంగా
దేవభూమి(ఉత్తరాఖండ్) ఘనత సాధించనుంది.
ముస్లింల సంప్రదాయ హక్కులను యూసీసీ
కాలరాస్తుందని
ఎమ్ఐఎమ్ అధినేత ఓవైసీ అన్నారు. ఈ
వ్యాఖ్యలను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఖండించారు.
యూసీసీ కారణంగా ఏ ఒక్కరి మత
విశ్వాసాలకు భంగం కలగదన్నారు.