అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల
రెండో జాబితాను గురువారం విడుదల చేయనున్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు.
భాగస్వామ్య పార్టీలతో చర్చలు కొలిక్కి రావడంతో పాటు అభ్యర్థుల మదింపు పూర్తి
అయినందున రెండో జాబితాలో ఎక్కువమంది అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. జనసేన, బీజేపీలు ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనే విషయమై ఆ పార్టీల నాయకత్వానికి
స్పష్టత ఉందన్న చంద్రబాబు, సమయానుకూలంగా ఆ పార్టీలు అభ్యర్థుల్ని
ప్రకటిస్తాయన్నారు.
టీడీపీ తొలి జాబితాలో 94 అసెంబ్లీ
స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ, జనసేనకు రెండు పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాలు పొత్తులో భాగంగా టీడీపీ
కేటాయించింది. దీంతో 50 అసెంబ్లీ, 17
లోక్‌సభ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ
144 చోట్ల పోటీ చేస్తుండగా, బీజేపీ పది చోట్ల, జనసేన 21 స్థానాల్లో పోత్తులో
భాగంగా పోటీ చేయనున్నాయి. 25 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ 17 చోట్ల, జనసేన రెండు సీట్లలో, బీజేపీలో ఆరు
చోట్ల పోటీ చేయనున్నాయి. జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ ఇంకా
జాబితాను ప్రకటించలేదు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు