Haryana New CM Clears Floor Test
హర్యానా కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఇవాళ
రాష్ట్ర శాసనసభలో బలపరీక్షలో గెలిచారు. దీంతో జేజేపీ మద్దతు లేకుండానే బీజేపీ ప్రభుత్వం
కొనసాగబోతోంది.
హర్యానాలో 2019 శానసనసభ ఎన్నికల అనంతరం బీజేపీ
స్థానిక పార్టీ అయిన జేజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
బీజేపీ నేత మనోహర్‌లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా
ఉపముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. తదనంతర పరిణామాల్లో బీజేపీ, జేజేపీ మధ్య
అంతరం పెరిగింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తమ అభ్యర్ధులను ప్రకటించిన సందర్భంలో,
జేజేపీకి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దాంతో ఆ రెండు పార్టీల మధ్యా పొత్తు కొనసాగబోవడం
లేదని అర్ధమైపోయింది.
ఆ నేపథ్యంలో నిన్న మనోహర్‌లాల్ ఖట్టర్
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. ఫలితంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి
వచ్చింది. రాష్ట్రంలో ఏ పార్టీకీ సాధారణ మెజారిటీ లేనప్పటికీ, ఎక్కువ స్థానాల్లో
గెలిచిన పార్టీగా బీజేపీ ఉంది. దాంతో ఆ పార్టీ స్వతంత్రుల మద్దతు కూడగట్టగలిగింది.
జేజేపీ లేకుండానే బలపరీక్షలో గెలిచింది.