రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన
ఎన్నికల బాండ్ల వివరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) సుప్రీంకోర్టుకు అఫిడవిట్ గా అందజేసింది. న్యాయస్థానం
ఆదేశాల మేరకు ఈ డేటాను ఎస్బీఐ మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఎస్బీఐ
అందజేసింది.
2019 ఏప్రిల్ 1,
నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు 22,217 ఎన్నికల బాండ్లను ఎస్బీఐ జారీ చేసింది.
బాండ్లను
ఎవరెవరు ఎంతకు కొనుగోలు చేశారు. ఏ ఏ పార్టీలు ఎంత ఎన్‌క్యాష్ చేసుకున్నాయనే వివరాలను ఎస్బీఐ
ఛైర్మన్ దినేశ్ కుమార్ అఫిడవిట్ లో సమర్పించారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెలలో సుప్రీంకోర్టు
రద్దు చేసింది.
22,030 బాండ్లను పలు రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్ చేసుకుని
నిధులు తీసుకున్నట్లు తెలిపిన ఎస్బీఐ, మిగతా 187 బాండ్లను నిబంధనల
ప్రకారం రిడీమ్ చేసి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి జమ చేశామని పేర్కొంది.
ఏ
పార్టీకి ఎన్ని నిధులు దక్కాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సుప్రీంకోర్టు
ఆదేశాల మేరకు ఈ నెల 15
సాయంత్రం 5గంటల్లోగా
ఈసీ ఈ సమాచారాన్ని వెబ్సైట్లో పేర్కొనాల్సి ఉంది.
ఎన్నికల
బాండ్ల పథకం ప్రారంభమైన తర్వాత 30 విడతల్లో ఎస్బీఐ వీటిని
విక్రయించింది.