ఏపీపీఎస్సీ,
2018లో నిర్వహించిన గ్రూప్-1పై రాష్ట్ర హైకోర్టు కీలకతీర్పు
వెల్లడించింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ
చేసింది.
జవాబు పత్రాలను మాన్యువల్ గా రెండుసార్లు
మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. మొదటిసారి
దిద్దిన ఫలితాలకు బదులు రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకున్నారని
పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ ను విచారించిన ఉన్నత
న్యాయస్థానం నేడు తీర్పు చెప్పింది. మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు
మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్న హైకోర్టు, ఎంపికైన అభ్యర్థుల జాబితాను
రద్దు చేయాలని ఆదేశించింది. మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీకి సూచించింది. ఎంపిక
ప్రక్రియను 6 వారాల్లోపు పూర్తిచేయాలని ఉత్తర్వులు జారీ
చేసింది.