కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం
కేఫ్ పేలుడు కేసు విచారణలో కీలక పురోగతి లభించింది. ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)
అరెస్టు చేసి విచారిస్తోంది. నిందితుడు బళ్లారికి చెందిన షబ్బీర్‌గా గుర్తించిన దర్యాప్తు
బృందం అతడిని అదుపులోకి తీసుకుంది.
రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1 బాంబు
పేలుడు జరగగా పది మంది గాయపడ్డారు. మాస్క్,
క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో
ప్రయాణించి కేఫ్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ పేలుడు పథార్థాలకు చెందిన బ్యాగ్ వదిలేసి
వెళ్ళడాన్న సీసీ కెమెరా ఫుటేజీలో గుర్తించారు. అనంతరం బెంగళూరులోని పలు
ప్రదేశాల్లో అనుమానంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడి ఆచూకీ
తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు అందజేస్తామని ఎన్ఐఏ
ప్రకటించింది.
మార్చి 3న ఈ కేసు దర్యాప్తు చేపట్టి ఎన్ఐఏ నేడు నిందితుడిని
అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది.