అయోధ్య
రామలయం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి భక్తులు బాలరాముడి హారతి
కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించే అవకాశం కల్పించింది. దూరదర్శన్ నేషనల్ ఛానల్ లో
ప్రతిరోజు ఉదయం6.30గంటలకు హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో ప్రతీ ఒక్కరూ
వీక్షించవచ్చు.
ప్రాణ
ప్రతిష్ట కార్యక్రమం తర్వాత ఇప్పటి వరకు అయోధ్య రాముడిని 75 లక్షల మంది భక్తులు
దర్శించుకున్నారు. వారంతంలో అయోధ్య రామయ్య దర్శనం కోసం సుమారు 2 లక్షల మంది
తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన సమాయాన్ని ఉదయం 6 .30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు పొడిగించారు. మధ్యాహ్నం ఒక గంట పాటు దర్శనాలు నిలిపివేసి స్వామివారికి
విశ్రాంతి కల్పిస్తున్నారు.
అయోధ్య-హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్
తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్ళే భక్తులకు,
స్పైస్ జెట్ విమానయాన సంస్థ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 2 నుంచి హైదరాబాద్-అయోధ్య మధ్య విమాన సర్వీసులు
ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మంగళవారం, గురువారం, శనివారాల్లో బోయింగ్ 737 విమానాలను హైదరాబాద్ -అయోధ్యకు సర్వీసులు
ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.