ప్రతీ
ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేలా
కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత పోలీస్ చర్య తరువాత సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రానికి స్వేచ్ఛ
లభించిన విషయాన్ని నోటిఫికేషన్ లో కేంద్రప్రభుత్వం ప్రస్తావించింది.
హైదరాబాద్
విమోచన దినం నిర్వహించాలని ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని అమరుల
జ్ఞాపకార్థం, యువతలో దేశభక్తి పెంపొందించేందుకు
హైదరాబాద్ విమోచన దినం నిర్వహించేందుకు నిర్ణయించినట్టు గెజిట్లో హోం శాఖ వివరించింది.
సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినంగా ప్రకటించాలని
బీజేపీ కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు
రాజకీయాల కోసం ఇన్నాళ్ళూ హైదరాబాద్ విమోచనదినం నిర్వహించలేదనే విమర్శలు ఉన్నాయి.
గడిచిన
రెండేళ్ళగా కేంద్రప్రభుత్వం, సాంస్కృతిక
మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినం నిర్వహిస్తోంది. గత బీఆర్ఎస్
ప్రభుత్వం సెప్టెంబర్ 17ను నేషనల్ ఇంటిగ్రేషన్ డే గా నిర్వహించింది.