మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ సమేత
మల్లికార్జున స్వామికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 5.16 కోట్ల ఆదాయం లభించింది. ఈ మేరకు
దేవస్థాన ఈవో పెద్దిరాజు ప్రకటన జారీ చేశారు. శ్రీశైలం క్షేత్రంలోని ఆలయాల్లో
భక్తులు సమర్పించిన కానుకలను పటిష్టమైన బందోబస్తు మధ్య లెక్కించారు. ఉభయ
దేవాలయాలలోని హుండీల ద్వారా రూ. 5,08,66,006 కోట్ల
కానుకలు ఆదిదంపతులకు వచ్చాయి. ఇక అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.8, 18, 411 లభించినట్లు అధికారులు వెల్లడించారు.
స్వామివార్లకు
సమర్పించిన కానుకల్లో నగదుతో పాటు బంగారం 122.400గ్రాములు, వెండి.5.900గ్రాములు లభించింది.
విదేశీ
కరెన్సీ కానుకల్లో భాగంగా యూఎస్ఏ–240
డాలర్లు, సింగపూర్ డాలర్లు – 25, మలేషియా రింగిట్స్– 2, అస్ట్రేలియా డాలర్లు – 30, UK పౌండ్లు– 30, UAE
దిర్హమ్స్ – 20
కూడా భక్తులు సమర్పించారు.
బ్రహ్మోత్సవాలకు
అహోబిలం ముస్తాబు
అహోబిలం
లక్ష్మీనరసింహాస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఈనెల 14 నుంచి 26 వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టాలు స్వామివారి కళ్యాణం, రథోత్సవం, గరుడోత్సవాలను దర్శించేందుకు సుమారు
లక్షమంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు
చేస్తున్నారు.