లోక్
సభ ఎన్నిలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినీనటుడు ఆర్.శరత్ కుమార్, తాను స్థాపించిన
ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి (AISMK)ని భారతీయ జనతాపార్టీ (BJP)లో విలీనం చేశారు.
AISMK ఆఫీస్ బేరర్లు, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
సమక్షంలో విలీనం చేశారు.
ఐక్యతతో
పాటు ఆర్థిక వృద్ధిని సాధించే దిశగా ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని
కొనియాడిని శరత్ కుమార్ , మాదక ద్రవ్యాల
మహమ్మారిని అంతం చేసి యువత సంక్షేమానికి భరోసా కల్పిస్తున్నారని ప్రశంచించారు.
2026లో తమిళనాడులో బీజేపీని అధికారంలోకి
తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
1996లో డీఎంకేలో చేరిన శరత్‌కుమార్.. 2001లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2006లో డీఎంకేకు వీడి సతీమణి రాధికతో కలిసి
అన్నాడీఎంకేలో చేరారు. కొద్ది నెలలకే
ఆ పార్టీకి
దూరమైన శరత్ కుమార్ దంపతులు, 2007
ఆగస్టులో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పార్టీని స్థాపించారు.