ఎన్నికల వేళ దేశంలో తప్పుడు సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు సీఈసీ సిద్దమైంది. ఇందుకు గూగుల్‌తో జట్టు కట్టింది. తప్పుడు సమాచారాన్ని అడ్డుకుని, సరైన సమాచారం ప్రజలకు చేరవేసేందుకు గూగుల్ ఈసీకి సహకరించనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పారదర్శకతకోసమే ఈసీతో జట్టుకట్టినట్లు గూగుల్ తెలిపింది.
ఓటు నమోదు నుంచి, ఓటు ఎలా వేయాలి అనే అంశాలను గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏఐని ఉపయోగించి ఇంగ్లీష్, హిందీల్లో సమాచారం అందుబాటులోకి తెచ్చారు.ఏఐ ఉపయోగించి కంటెంట్ తయారు చేసి యూట్యూబ్‌లో పెట్టే వీడియోలపై లేబుల్ వేయడం ప్రారంభించారు.
గూగుల్, యూట్యూబ్‌లొ ఎన్నికలకు సంబంధించిన సమాచారం గుర్తింపు పొందిన సంస్థల నుంచే ప్రజలకు చేరేలా గూగుల్ చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన కంటెంట్‌ను తొలగించేందుకు సిబ్బందిని నియమించారు. ఇందుకు మెషిన్ లెర్నింగ్ కూడా ఉపయోగిస్తున్నారు.