భారత
వాయుసేనకు చెందిన తేజస్ ఎయిర్క్రాఫ్ట్ కూలింది. శిక్షణ సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా
ఫైలెట్ ప్రాణాలతో బయటపడ్డాడు.
రాజస్థాన్లోని
జైసల్మేర్ వద్ద ఓ స్టూడెంట్ హాస్టల్ భవనం వద్ద తేజస్ ఎయిర్క్రాఫ్ట్ శకలాలు
పడ్డాయి. దీంతో ఆ ప్రదేశంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడికి
చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలు ఇతర ప్రాంతాలకు అలుముకోకుండా
అదుపు చేశారు.
ఘటనపై ట్వీట్
ద్వారా వివరాలు వెల్లడించిన వాయుసేన, ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించినట్లు
తెలిపింది. 2001లో
తేజస్ ఎయిర్క్రాఫ్ట్ సేవలు ప్రారంభమైన తర్వాత ఈ తరహా ప్రమాదం జరగడం ఇదే
తొలిసారి.