హర్యానాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం ఖట్టర్ రాజీనామా చేయడంతో, బీజేపీ నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీని ప్రకటించింది. సైనీ ప్రస్తుతం హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.కొద్ది గంటల్లో సైనీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆయన ప్రస్తుతం కురక్షేత్ర ఎంపీగా ఉన్నారు.
మనోమర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో హర్యానాలో సైనీకి అవకాశం దక్కింది. చాలా మంది పేర్లు పరిశీలించిన బీజేపీ పెద్దలు చివరకు సైనీ వైపు మొగ్గుచూపారు. ఈయన ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.
ఓబీసీ సామాజికవర్గానికి చెందిన సైనీ 1996లో బీజేపీలో చేరారు. 2014లో తొలిసారి నారాయణ్‌గఢ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016లో మంత్రి అయ్యారు. 2019లో ఎంపీగా కురుక్షేత్ర నుంచి గెలిచారు. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో సైనీల జనాభా 8 శాతం ఉంది. హిస్సార్, అంబాలా, రేవాడీ, కురుక్షేత్ర జిల్లాలో వీరి ప్రభావం ఎక్కువగా
ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సైనీలను ఆకట్టుకునేందుకు సీఎం పదవి ఆ సామాజిక వర్గానికి ఇచ్చినట్లు తెలుస్తోంది.