పాకిస్థాన్‌తో చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్దమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. రెండు దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న జైశంకర్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఒకవేళ పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిగితే అది ఉగ్రవాదంపైనే ప్రధానంగా ఉంటుందన్నారు. పాక్‌తో భారత్ సంబంధాలు, చైనాతో సరిహద్దు వివాదాలు, రష్యాతో చెలిమి వంటి అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
పెద్ద ఎత్తున ఉగ్ర శిబిరాలు ఉన్న దేశంతో చర్చలకు అవకాశం వస్తే దాని గురించే మాట్లాడాల్సి ఉంటుందని పాక్‌ను ఉద్దేశించి జైశంకర్ వ్యాఖ్యానించారు.ప్రస్తుతం అలాంటి చర్చలకు అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సరిహద్దు వివాదంపై చైనాతో నాలుగేళ్లుగా చర్చలు జరుపుతున్నా పురోగతి లేదన్నారు.
సరిహద్దు విషయంలో న్యాయ పరిష్కారానికి కట్టుబడి ఉండటంతోపాటు, వాస్తవాధీన రేఖ వద్ద పెద్ద ఎత్తున సైన్యం మోహరించాల్సి ఉందన్నారు. వాస్తవాధీన రేఖలో ఎలాంటి మార్చులకు అంగీకరించేది లేదన్నారు. రష్యా చైనాలు దగ్గరైనా భారత్‌కు వచ్చిన ముప్పులేదని జైశంకర్ అభిప్రాయపడ్డారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు