సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పౌరసత్వ సవరణ చట్టం 2019ని అమల్లోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2019లోనే చట్టం చేసినా అప్పటి నుంచి విధివిధానాలు ఖరారు చేయలేదు. ఎన్నికలకు ముందే సీఏఏ అమల్లోకి వస్తుందని ఇటీవల హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన తరవాత దీనిపై సర్వత్రా చర్చమొదలైంది.
ఈ చట్టం ప్రకారం బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాల నుంచి భారత్లోకి వచ్చిన ముస్లిమేతరులను శరణార్థులుగా గుర్తించి వారికి పౌరసత్వం కల్పిస్తారు. 2014 డిసెంబరు 31 కంటే ముందే దేశంలోకి వచినట్లు ఆధారాలు ఉండాలి. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్దులు, జైనులు, పార్సీలకు సీఏఏ వర్తిస్తుంది. ఆన్లైన్ ద్వారా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయడంతో సీఏఏ అమల్లోకి వచ్చినట్టైంది.