పౌరసత్వ సవరణ చట్టం 2019కు ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఏఏను పార్లమెంట్ 2019లోనే ఆమోదించింది.విధివిధానాలు రూపొందించి అమల్లోకి మాత్రం తీసుకురాలేదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ లోపే సీఏఏను అమల్లోకి తీసుకురావాలని కేంద్రం పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
సీఏఏ అమలు చేసి తీరుతామని ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండటంతో ఇవాళ రాత్రికి సీఏఏ అమలుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు కేంద్ర మంత్రి శంతనూ ఠాగూర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో సీఏఏ అమలుకు స్పష్టమైన ప్రకటన చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి.