AP BJP Kisan Morcha State Level Meeting
భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర
కార్యవర్గ సమావేశం ఇవాళ విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్దుల గెలుపు కోసం ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని కిసాన్ మోర్చా
రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. మిత్రపక్షాల అభ్యర్ధుల గెలుపుకోసం కూడా అదే శ్రమతో
పనిచేయాలని కూడా తీర్మానం చేసింది.
కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
చిగురుపాటి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు
వచ్చాయి. వైసీపి ప్రభుత్వం రైతుల పట్ల
వివక్ష చూపించిందని కార్యవర్గం అభిప్రాయపడింది. ఈ వ్యవసాయ సంవత్సరంలో రెండుసార్లు
అధిక వర్షాలవల్ల, పంటలు దెబ్బతింటే కిసాన్ మోర్చా పోరాటంతో రైతులకు కొంతమేర న్యాయం జరిగింది. బిజెపి
రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి నాయకత్వంలో రైతులకు అండగా ఉద్యమాలు
చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నారు.
వ్యవసాయ మంత్రి కూడా రైతులను గుర్తించడం లేదనీ, రైతులు
కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శకు కూడా రాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
సార్వత్రిక ఎన్నికల్లో రైతు అనుకూల ప్రభుత్వం రావాలని, కేంద్రం చేస్తున్న సంక్షేమం
రైతుకు అందాలంటే వైసీపి గద్దె దిగాలని
తీవ్ర స్వరంతో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలొ
కిసాన్ మోర్చా రాష్ట్రప్రధాన కార్యదర్శులు
పి రవిరాజు, సురేంద్ర రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పిక్కినాగేంద్ర, తోట
గంగరాజు తదితరులు పాల్గొన్నారు.