పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేస్తున్నాడనే అనుమానంతో ముంబైలోని మజగావ్ డాక్ యార్డులో పనిచేస్తున్న ఓ కీలక ఉద్యోగిని మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. డాక్ యార్డులో స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్‌గా చేస్తోన్న కల్పేష్ బైకర్ పాకిస్తాన్ మహిళ హానీట్రాప్‌లో పడ్డాడు. ఆమెకు కీలక సమాచారం అందిచారనే అనుమానాలపై అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన పాకిస్తాన్‌కు చెందిన మహిళలకు కల్పేష్ నెల రోజులుగా సంబంధాలు నెరపుతున్నట్లు గుర్తించారు. కీలక సమాచారం ఇచ్చి ఆమె నుంచి డబ్బు తీసుకున్నట్లు తెలుస్తోంది.
కల్ఫేష్ను ఏటీఎస్ అధికారులు విచారించారు. 2021 నవంబర్ నుంచి 2023 మే వరకు ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా పాక్ మహిళతో మాట్లాడినట్లు గుర్తించారు.అధికారిక రహస్యాల చట్టం కింద బైకర్‌ను అరెస్ట్ చేశారు. పాక్ ఏజంట్‌కు బైకర్ ఎలాంటి సమాచారం పంపించాడనే దానిపై ఏటీఎస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.బైకర్పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు