Former
couple contesting against each other in LS Polls in WB
కొన్నాళ్ళ
క్రితం విడాకులు తీసుకున్న దంపతులు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పరస్పరం పోటీ
పడుతున్నారు. ఈ విషయం ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ లోక్సభ అభ్యర్ధుల
జాబితా విడుదల చేసినప్పుడు వెల్లడైంది.
రాబోయే
లోక్సభ ఎన్నికల్లో బంకురా జిల్లాలోని బిష్ణుపూర్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుజాతా మండల్
అనే మహిళ పోటీ చేస్తోంది. ఆమె ప్రత్యర్థి వేరెవరో కాదు, ఆమె మాజీ భర్తే. సుజాతతో
విడిపోయిన సౌమిత్ర ఖాన్, బిష్ణుపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ
చేస్తున్నారు. బీజేపీ లోక్సభ అభ్యర్ధుల తొలిజాబితాలోనే ఆయన పేరు ప్రకటించేసారు.
సుజాతా
మండల్, సౌమిత్ర ఖాన్లు 2021లో పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల సమయంలో విడాకులు
తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ
పార్టీ తరఫున ఆ ఎన్నికల్లో సుజాత పోటీ చేసింది. దాంతో ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు
సౌమిత్ర ఖాన్ మీడియా కెమెరాల ముందే ప్రకటించాడు.
2019
లోక్సభ ఎన్నికల సమయంలో సౌమిత్ర తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరాడు. అప్పట్లో
సుజాత అతనికి అనుకూలంగా ప్రచారం నిర్వహించింది.