Father
slits daughter throat, and commits suicide
హర్యానాలోని
హిసార్‌లో దారుణం జరిగింది. ఓ ప్రొఫెసర్ తన ఎనిమిదేళ్ళ కూతురిని హతమార్చి, ఆ
తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటన గురించి పోలీసులు ఇలా చెప్పారు….
సందీప్
గోయల్ (35) లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటరినరీ అండ్ యానిమల్ సైన్సెస్‌లో
ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. అతను కొంతకాలంగా క్లినికల్ డిప్రెషన్‌తో బాధ పడుతున్నాడు.
నిన్న ఆదివారం సాయంత్రం 4గంటల సమయంలో తన 8ఏళ్ళ కూతురు సనయాను స్కూటర్ మీద బైటకు
తీసుకునివెళ్ళాడు.
ఎంతసేపటికీ
బైటకు వెళ్ళిన తండ్రీ కూతుళ్ళు తిరిగిరాకపోవడంతో సందీప్ భార్య వారిని వెతకడానికి
విశ్వవిద్యాలయానికి వెళ్ళింది. అక్కడ వెటరినరీ సర్జరీ అండ్ రేడియాలజీ విభాగం బైట సందీప్
స్కూటర్ ఉండడం గమనించింది. డిపార్ట్మెంట్లోకి వెళ్ళి చూస్తే ఆఫీస్ తలుపు
లోపలినుంచి లాక్ చేసి ఉంది. దాంతో ఆమె సెక్యూరిటీ గార్డును పిలిచింది. వాళ్ళు
తలుపు బద్దలుగొట్టి లోపలికి వెళ్ళి చూసారు. ఆ గది లోపల ప్రొఫెసర్, ఆయన కూతురి
శవాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. దాంతో వాళ్ళు కంగారుపడి పోలీసులను పిలిచారు. ఘటనా
స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి
తరలించారు.
సందీప్
గోయల్ హర్యానాలోని నర్వానా ప్రాంతానికి చెందినవాడు. అతని తండ్రి నర్వానాలో
అకౌంటెంట్‌గా పనిచేసేవాడు. సందీప్, యూనివర్సిటీలోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో
భార్య, పిల్లలతో ఉండేవాడు.
ఈ
కేసు గురించి హర్యానా పోలీసులు ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. ‘‘ఆధారాల శాస్త్రీయ
అన్వేషణ కోసం మేం మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్‌ని పిలిచాం. ముందుగా క్రైమ్ సీన్ వద్ద
ఆధారాల సేకరణకు ప్రయత్నిస్తున్నాం’’ అని ఏఎస్పీ రాజేష్ మోహన్ చెప్పారు. ప్రొఫెసర్
సందీప్ గోయల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు, దానివల్లే ఆత్మహత్య చేసుకోవాలన్న
ఉద్రిక్తత కలిగిందన్నారు. సందీప్ సహోద్యోగులు చెప్పిన వివరాల మేరకు అతను ఒక ఫిజియో
థెరపిస్ట్ దగ్గర చికిత్స తీసుకుంటున్నాడు… అని పోలీసులు వివరించారు.
సందీప్ ఒక సర్జికల్
బ్లేడ్‌తో తొలుత తన కూతురి గొంతు కోసాడు. తర్వాత తన మెడ మీద కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం
అవడంతో తండ్రీ కూతుళ్ళు ఇద్దరూ వెంటనే చనిపోయారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు