సినీ ప్రియులెందరో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్లో ఈ ఉత్సవాలు ఆదివారం వేడుకగా జరిగాయి. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఓపెన్ హైమర్ చిత్రం ఆస్కార్‌లో సత్తాచాటింది. ఈ చిత్రం ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులు సహా పలు అవార్డులను కొల్లగొట్టింది. పూర్ థింగ్స్ మూవీ కూడా ఆస్కార్ బరిలో సత్తా చాటుకుంది.
ప్రకటించిన ఆస్కార్ అవార్డులు
ఉత్తమ చిత్రం : ఓపెన్ హైమర్
ఉత్తమ దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్(ఓపెన్ హైమర్ చిత్రం)
ఉత్తమ నటుడు : కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
ఉత్తమ నటి : ఎమ్మాస్టోన్ ( పూర్ థింగ్స్)
ఉత్తమ సహాయ నటుడు : రాబర్ట్ డౌనీ జూనియర్(ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటి : జో రాండాల్ఫ్ ( ద హోల్డోవర్స్)