కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇండీ కూటమికి పశ్చిమబెంగాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 42 ఎంపీ స్థానాలకు టీఎంసీ తమ అభ్యర్థులను ప్రకటించింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కోల్కతాలో మొత్తం 42 స్థానాలకు టీఎంసీ అభ్యర్థులను ప్రకటించారు.
డైమండ్ హార్బర్ నుంచి అభిషేక్ బెనర్జీ, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ బెర్హమ్పూర్ నుంచి బరిలో నిలవనున్నారు. టీఎంసీ 42 సీట్లకూ అభ్యర్థులను ప్రకటించడంతో ఇక పశ్చిమబెంగాల్లో ఇండీ కూటమి శకం ముగిసినట్టైంది. గత లోక్సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 18 సీట్లు గెలుచుకుని సత్తా చాటుకుంది. కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకుంది. ఎన్టీయే కూటమి దేశవ్యాప్తంగా 303 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 52 సీట్లకే పరిమితమైంది.