హైకోర్టు
ఉత్తర్వుల మేరకు డీఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30
నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షల షెడ్యూల్ ఉండేలా పాఠశాల
విద్య కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
ప్రభుత్వ
పాఠశాలల్లో 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం గతంలో
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలు
నిర్వహించింది.
గత నోటిఫికేషన మేరకు ఈ నెల 15 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం
కావాల్సి ఉంది. టెట్, డీఎస్సీ మధ్య నాలుగు వారాల సమయం
ఉండాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేసినట్లు
అధికారులు తెలిపారు.
ఏప్రిల్‌లో
ఐఐటి జేఈఈ, ఇతర అర్హత పరీక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేవన్నారు.
అందువల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ డీఎస్సీ షెడ్యూలు రూపొందించామన్నారు.
కొత్త షెడ్యూల్ ..
మార్చి 30
నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు సెషన్లలో సెకండరీ
గ్రేడ్ టీచర్ పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 7న ప్రిన్సిపల్ పోస్టులకు ఇంగ్లిష్
ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30
వరకూ స్కూల్ అసిస్టెంట్,
టీజీటీ, పీజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహించనున్నట్లు
తాజా షెడ్యూల్ లో పేర్కొన్నారు. మార్చి 25
నుంచి హాల్–టికెట్స్ డౌన్‌లోడ్
చేసుకోవచ్చు.
బ్యాచిలర్
ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు అర్హులు కారంటూ హైకోర్టు తీర్పు
చెప్పింది. దీంతో కొత్తగా జీఓ–22ను అమల్లోకి తెచ్చారు. పూర్తి వివరాలు DSC https:// apdsc. apcfss. inలో పొందుపరిచినట్లు విద్యాశాఖ
అధికారులు తెలిపారు.