ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ,
బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేయనున్నాయి. దిల్లీలో బీజేపీ అగ్రనేత,
కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సమావేశమై ఎన్డీయేలో టీడీపీ చేరికపై చర్చించారు.
రాష్ట్రంలో ఇప్పటికే జనసేన, టీడీపీ మధ్య మైత్రిబంధం ఉండగా తాజాగా బీజేపీ కూడా ఈ
కూటమిలో చేరినట్లు మూడు పార్టీల పేరిట ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. జేపీ నడ్డా,
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తరఫున బీజేపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేనతో పొత్తుపై బీజేపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఉమ్మడి
పత్రికా ప్రకటన వెలువడింది. ఆంధ్రప్రదేశ్
ప్రజల ఆకాంక్ష, దేశాభివృద్ధి కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ
చేస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నికలకు
వెళ్లేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు కలిసి పనిచేయాలని ప్రకటనలో తెలిపారు.
భారతీయ
జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక
సభ ఎన్నికల్లో కలిసి పనిచేస్తాయని ప్రకటనలో వివరించారు.
బీజేపీ,
టీడీపీల పాత స్నేహాన్ని ప్రకటనలో గుర్తు చేశారు. అటల్ బిహారీ
వాజ్ పేయి ప్రభుత్వంలోనూ, నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనూ టీడీపీ భాగస్వామిగా పనిచేసిందని
పేర్కొన్నారు.
మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం, ఇతర
విషయాలపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ప్రకటనలో తెలిపారు.