మానవ సహిత సముద్రయాన్ మిషన్ 2025 చివరి నాటికి చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ మిషన్ ద్వారా సముద్రంలో ఆరువేల మీటర్ల లోతులో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు మత్య్స జలాంతర్గామిని సిద్దం చేసినట్లు కేంద్ర మంత్రి మీడియాకు వివరించారు.ఈ మిషన్ పనులు తుది దశలో ఉన్నాయన్నారు.
సముద్రంలో జీవ వైవిద్యం, వనరుల అధ్యయనానికి ఈ మిషన్ ఉపకరిస్తుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో ఇందుకు సంబంధించిన మిషనరీ తయారీ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఈ మిషన్లో అధునాతన టూల్స్ ఉంటాయి. ఇది 12 గంటలపాటు పనిచేయనుంది.అత్యవసర పరిస్థితుల్లో దీని పనిని 4 రోజులకు పెంచవచ్చు. రష్యా, చైనా, అమెరికా, జపాన్ దేశాలు మాత్రమే ఇలాంటి మిషన్ను విజయవంతం చేశాయని మంత్రి గుర్తుచేశారు. భారత్ చేపట్టే సముద్రయాన్ విజయవంతం ద్వారా ఆ దేశాల సరసన చేరనుంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు