మిస్ వరల్డ్ -2024గా చెక్ రిపబ్లిక్ భామ
క్రిస్టీనా పిస్కోవా రికార్డు నెలకొల్పారు. ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్-2024 పోటీల్లో ఆమె
ఎన్నికయ్యారు. పోటీల్లో పాల్గొన్న 112 దేశాల సుందరీమణుల్లో ఆమె ప్రథమ స్థానంలో నిలిచారు.
క్రిస్టీనా తరువాత స్థానంలో లెబనాన్ కు
చెందిన యాస్మిన్ అజైటౌన్ నిలవగా మూడో స్థానంలో ట్రినిడాడ్ అండ్ టుబాగోకు చెందిన ఆచే అబ్రహాంస్ ఉన్నారు.
లీసాగో చోంబో (బొత్స్వానా) నాలుగో
స్థానం దక్కించుకున్నారు.
భారత్కు ప్రాతినిథ్యం వహించిన కన్నడ భామ సినీ శెట్టి
టాప్-8కే పరిమితమైంది. ముంబై కు చెందిన 22 ఏళ్ళ ఫెమినా మిస్ ఇండియా సిని శెట్టి అయిదో
స్థానంతో సరిపెట్టుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతా అంబానీ విచ్చేయగా ఆమెకు మిస్
వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్వుమన్ జూలియా మోర్లీ.. మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్
అవార్డును ప్రదానం చేశారు.