శ్రీశైలం
క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీభ్రమరాంబ
సమేత మల్లికార్జున స్వామి వారి రథోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. స్వామి,
అమ్మవార్లను దర్శంచుకునేందుకు దాదాపు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు.
రథోత్సవ
ప్రారంభానికి ముందు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి స్వామి అమ్మవార్లకు
సాత్వికబలి నిర్వహించారు.
రథోత్సవాన్ని
వీక్షించిన వారికి సర్వపాపాలు తొలిగి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని
నమ్మకం.
బ్రహ్మోత్సవాల్లో
చివరి ఘట్టంలో భాగంగా ఆది దంపతులకు తెప్పోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు.
కపిలతీర్థంలో
త్రిశూల స్నానం…
తిరుపతి కపిలతీర్థంలో శ్రీ
కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శివపార్వతుల కల్యాణం
శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన నేడు త్రిశూలస్నానం వైభవంగా జరుగనుంది. శ్రీ
నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 నుంచి 10
గంటల వరకు రావణాసుర వాహనసేవ నిర్వహిస్తారు.