నిషేధిత
ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)తో
సంబంధాలు కొనసాగిస్తున్న అనుమానితుల జాబితాను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జరిగిన
పలు హింసాత్మక దాడులతో పాటు వివాదాస్పద చర్యల్లో పీఎఫ్ఐ పాత్ర ఉన్నట్లు పలు విచారణ
సంస్థల దర్యాప్తులో వెల్లడైంది.
మత విద్వేషాలు, హింసాత్మక చర్యలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు
పాల్పడటంతో పీఎఫ్ఐ ను 2022 సెప్టెంబర్ లో భారత ప్రభుత్వం నిషేధించింది.
జాతీయ
దర్యాప్తు సంస్థ విడుదల చేసిన అనుమానితుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు
ఉన్నారు. వీరంతా ఈ నిషేధిత పీఎఫ్ఐలో కీలక స్థానాల్లో పనిచేసినట్లు తేలింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు
పాల్పడటంతో పాటు దేశంలో అశాంతి రేపడమే లక్ష్యంగా పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అనుమానితుల
వివరాలు అందించే వారికి తగిని పారితోషకం అందజేస్తామని దర్యాప్తు సంస్థ తెలిపింది.
అలాగే సమాచారం అందజేసిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని పేర్కొంది. అనుమానితుల గురించి ఏమైనా వివరాలు తెలిస్తే +91-9497715294కు
వాట్సాప్ ద్వారా సమాచారం అందజేయాలని ఎన్ఐఏ
కోరింది.
ఎన్ఐఏ
విడుదల చేసిన అనుమానితుల వివరాలు..
1. షేక్ ఇలియాస్ అహ్మద్ S/O గౌస్ బాషా, ఖాజా నగర్ గ్రామం.
బుచ్చిరెడ్డి పాలెం మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
2. అబ్దుల్ సలీమ్, S/O అబ్దుల్ గఫూర్, ఇస్లాంపూర గ్రామం, జగిత్యాల జిల్లా, తెలంగాణ.
3. మహమద్ అబ్దూల్ అహాద్ S/O అబ్దుల్ వాహీద్, ముజాహిద్ నగర్,
నిజామాబాద్, తెలంగాణ.
నిషేధిత
ఉగ్రవాద సంస్థ పీఎఫ్ఐ నేతృత్వంలో దేశ వ్యతిరేక కుట్రలు జరగడంతో పాటు హింస,
తీవ్రవాద చర్యలకు పాల్పడినట్లు చార్జిసీషీటులో జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది.
పరారీలో ఉన్నవారిపై రూ. 2 లక్షల రివార్డు ప్రకటించింది.
2022
జులైలో నిజామాబాద్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసినప్పుడు పీఎఫ్ఐ తెలంగాణ నార్త్ జోన్ విభాగ బాధ్యతలు
చూస్తున్న అబ్దుల్ సలీమ్ ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. అనంతరం ఈ కేసు
విచారణను ఎన్ఐఏ స్వీకరించింది. అప్పటి
నుంచి అబ్దుల్ సలీమ్ పరారీలో ఉన్నాడు.