ధర్మశాల టెస్ట్ లో ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 259 పరుగులు వెనకబడి రెండో
ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 195 పరుగులకే పెవిలియన్ చేరింది.
దీంతో రోహిత్ సేన ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో
జో రూట్(84) ఒంటరి పోరాటం చేయగా మరో సీనియర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో(39)
తన వంతుగా సహాయం అందించే ప్రయత్నం చేశాడు. బెయిర్ స్టో ఔట్
అయిన తర్వాత ఇంగ్లండ్ జట్టు 195 పరుగులకే పెవిలియన్ చేరింది.
భారత బౌలర్లలో రవిచంద్రన్
అశ్విన్ ఐదు వికెట్లు తీయగా, కుల్ దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు
వికెట్లు తీశారు. జడేజా ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులు చేయగా భారత్ 477 పరుగులు చేసింది.
హైదరాబాద్ లో తొలి టెస్ట్
గెలిచిన ఇంగ్లండ్, ఆ తర్వాత విశాఖపట్నం,
రాజ్ కోట్, రాంచీ, ధర్మశాలలో ఓడింది.