భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోని తూర్పు సెక్టార్లో
నిర్మించిన సేలా టన్నెల్ ప్రధాని మోదీ
ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో నేడు పర్యటించిన ప్రధాని
మోదీ, ‘వికసిత్ భారత్- వికసిత్ నార్త్ ఈస్ట్’ కార్యక్రమంలో భాగంగా ఈ
ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
ప్రపంచంలోనే పొడవైన రెండు వరుసల టన్నెల్‌గా ఈ
ప్రాజెక్టు గుర్తింపు పొందింది.
సముద్ర
మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఈ టన్నెల్ నిర్మాణం జరిగింది. బాలిపారా-చారిదౌర్-తవాంగ్
తో అనుసంధానమే లక్ష్యంగా దీనిని నిర్మించారు.
సరిహద్దు
రహదారుల సంస్థ నేతృత్వంలో నిర్మాణ పనులు జరిగాయి. టన్నెల్-1 పొడవు 1,003 మీటర్లు
కాగా, టన్నెల్-2 పొడవు 1,595 మీటర్లు
ఉంది.
భారత్-చైనా
సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వేగంగా రాకపోకలు సాగించేందుకు ఈ
ప్రాజెక్టు దోహదపడుతుంది.
తవాంగ్-దిరాంగ్
ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది.
2019
ఫిబ్రవరి 9న ఈ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్రమోదీ, శంకుస్థాపన చేయగా ప్రభుత్వం
రూ.825 కోట్లు కేటాయించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ చైనా సరిహద్దుకు
సమీపంలో ఈ ప్రాజెక్టు ఉంటుంది.