ఇంగ్లండ్,
భారత్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా ఆఖరిపోరు
జరుగుతోంది. ఆఖరి టెస్ట్ మూడో రోజు ఆటలో భాగంగా భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ 477
పరుగులు వద్ద ముగిసింది.
ఓవర్ నైట్
స్కోర్ 437/8తో మూడో రోజు మొదలు
పెట్టిన భారత్ 40 పరుగులు జోడించి ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్ లో 124.1 ఓవర్లు ఆడిన రోహిత్ సేన, 477 పరుగులకు ఇన్నింగ్స్
ను ముగించింది. కుల్ దీప్ యాదవ్ ( 30), జస్ ప్రీత్ బుమ్రా(20) పరుగులు చేశారు.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన
వెంటనే వికెట్ కోల్పోయింది. అశ్విన్
బౌలింగ్లో బెన్ డకెట్ (2) బౌల్డయ్యాడు. ఆ తర్వాత జాక్ క్రాలే 21 పరుగుల వద్ద
పెవిలియన్ చేరాడు. అశ్విన్ వేసిన 5.3 బంతిని ఆడగా సర్ఫరాజ్ క్యాచ్ అందుకున్నాడు.
దీంతో క్రాలే వెనుదిరిగాడు. ఇంగ్లండ్ 36 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది.
ఓలీ
పోప్( 19) కూడా అశ్విన్ బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత కుల్ దీప్ యాదవ్ వేసిన 17.4 బంతికి జానీ బెయిర్ స్టో ఎల్బీగా
వెనుదిరిగాడు. దీంతో 92 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయిన ఇంగ్లండ్, 103 పరుగుల
వద్ద ఐదో వికెట్(బెన్ స్టోక్స్) కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్ లో బెన్ స్టోక్స్ (
2) బౌల్డ్ అయ్యాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ ఐదు వికెట్లు నష్టపోయి, 22.5
బంతుల్లో 103 పరుగులు చేసింది.
భారత్ నిర్దేశించి లక్ష్యాన్ని చేరుకునేందుకు మరో
156 పరుగులు అవసరం. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా కుల్ దీప్ యాదవ్
ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.