కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సురేశ్ పచౌరీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ చేరిన మరుసటి రోజే సురేశ్ పచౌరీ పార్టీ మారటం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతోందని, బీజేపీ సీనియర్ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ చురకలు వేశారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీలో ఎవరూ మిగిలే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
సురేశ్ పచౌరీ లాంటి సీనియర్ నేతలకు ఆ పార్టీలో చోటు లేకుండా పోయిందని అందుకే వారు కాంగ్రెస్ వీడుతున్నారని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ మీడియాకు చెప్పారు. సీనియర్ నాయకులంతా కాంగ్రెస్ వీడుతుంటే, రాహుల్ గాంధీ న్యాయ్ యాత్రలో బిజీగా ఉన్నారంటూ బీజేపీ సీనియర్ నేత కౌలాష్ విజయ్వర్జియ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులంతా కళ్ళు తెరిచారని, ఆ పార్టీ ద్వారా దేశంలో ఒక్కరికి కూడా న్యాయం జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.