కెనడాలో హత్యకు గురైన ఉగ్రవాది హర్‌ప్రీత్ నిజ్జర్ వీడియో ఒకటి తాజాగా వెలుగు చూసింది. కొందరు దుండగులు ఆయన్ని కాల్చి చంపడం ఆ వీడియోలో కనిపించింది. ఈ విషయాన్ని కెనడాకు చెందిన సీబీసీ న్యూస్ ఛానల్ వెలుగులోకి తీసుకురావడం సంచలనంగా మారింది.
జాతీయ దర్యాప్తు సంస్థ నిజ్జర్‌ను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.తరువాత నిజ్జర్ దేశం వదిలి కెనడాకు పారిపోయాడు. గత ఏడాది జూన్ 18న కెనడాలోని ఓ గురుద్వారా వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో నిజ్జర్ చనిపోయిన సంగతి తెలిసిందే.
రెండు వాహనాల్లో వచ్చిన ఆరుగురు దుండగులు నిజ్జర్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు వీడియో ద్వారా తెలుస్తోందని సీబీసీ న్యూస్ ప్రసారం చేసింది. ఈ హత్య పక్కా ప్రణాళిక ప్రకారం జరిపినట్లు ఉందంటూ సీబీసీ ప్రసారం చేసింది. గురుద్వారా పార్కింగ్ ప్రదేశం నుంచి వెళుతోన్న నిజ్జర్‌పై ఆరుగురు దుండగుల్లో ఇద్దరు అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ తరువాత వారు ఓ వాహనంలో పరారయ్యారు. అక్కడే పక్కనే మరో ఇద్దరు సాకర్ ఆడుతూ వీడియోలో కనిపించారు.
నిజ్జర్ హత్య వెనుక భారత హస్తముందని కెనడా ప్రధాని ట్రూడో చేసి వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. నిజ్జర్ హత్య తరవాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు