The Weather Woman of India, Anna Mani
మహిళా దినోత్సవ ప్రత్యేకం
: అన్నామణి (1918-2001)
అన్నామణి పుణేలోని భారత
వాతావరణ విభాగంలో పరిశోధన చేసింది. వాతావరణ అధ్యయనానికి కావలసిన ఉపకరణాలపై పదుల
సంఖ్యలో రిసెర్చ్ పేపర్లు రాసింది.
పచయ్ కాలేజీలో డిగ్రీ
పూర్తిచేసాక, అన్నామణి ప్రొఫెసర్ సాలమన్ పాపయ్య దగ్గర చేరింది. వజ్రాలు, కెంపుల
ప్రకాశ ధర్మాలపై పరిశోధన చేసింది. ఆమె మొత్తం ఐదు రిసెర్చ్ పేపర్స్ రాసి, పిహెచ్‌డి
కోసం దాఖలు చేసింది. అయితే భౌతికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయనందున తనకు
పిహెచ్‌డి పట్టా ప్రదానం చేయలేదు. 1948లో భారతదేశానికి తిరిగివచ్చాక పుణేలోని
వాతావరణ విభాగంలో చేరింది. అక్కడే ఆమె వాతావరణ అధ్యయనానికి సంబంధించిన ఉపకరణాల
గురించి ఎన్నో రిసెర్చ్ పేపర్లు దాఖలు చేసింది. 1953నాటికి ఆమె వాతావరణ విభాగానికి
అధిపతి అయింది. ఆమె కింద 121 మంది పురుషులు పనిచేస్తుండేవారు.
వాతావరణ గణనకు సంబంధించి అన్నామణి సుమారు 100
వేర్వేరు ఉపకరణాల డ్రాయింగ్స్‌ను ప్రామాణీకరించింది. సోలార్ రేడియేషన్‌ను
కొలవడానికి ఆమె 1957-58లో కొన్ని వాతావరణ కేంద్రాల నెట్వర్క్‌నే ఏర్పాటు చేసింది.
గాలి వేగాన్నీ, ఎండ శక్తినీ కొలిచేందుకు ఆ ఉపకరణాలను తయారుచేసే ఒక వర్క్‌షాప్‌ను
ఆమె బెంగళూరులో ఏర్పాటు చేసింది.
వాతావరణంలో ఓజోన్ స్థాయిని కొలవడానికి ఒక ఉపకరణాన్ని అభివృద్ధి చేసింది. ఆమె
ప్రయోగాల ప్రామాణికతను గుర్తించిన అంతర్జాతీయ ఓజోన్ అసోసియేషన్, అన్నామణికి తమ
సంస్థలో సభ్యత్వం ఇచ్చింది. కేరళలోని తుంబా రాకెట్ లాంచింగ్ కేంద్రం దగ్గర
అన్నామణి ఒక మెటిరొలాజికల్ అబ్జర్వేటరీని, ఇన్‌స్ట్రుమెంటేషన్ టవర్‌నూ ఏర్పాటు
చేసింది.
అన్నామణి ఎన్నో శాస్త్రసాంకేతిక విజ్ఞానాలకు
సంబంధించిన సంస్థలతో కలిసి పనిచేసేది. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ, అమెరికన్
మెటిరలాజికల్ సొసైటీ, ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ సొసైటీ, వరల్డ్ మెటిరలాజికల్
ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ మెటిరలాజీ అండ్ అట్మాస్పియరిక్ ఫిజిక్స్
వంటి సంస్థలతో కలిసి పని చేసేది. అన్నామణి 1975లో ఈజిప్ట్‌లో వరల్డ్ మెటిరలాజికల్
ఆర్గనైజేషన్‌కు కన్సల్టెంట్‌గా వ్యవహరించింది. 1976లో భారత వాతావరణ శాఖ డిప్యూటీ
డైరెక్టర్ జనరల్‌గా ఆవిడ పదవీ విరమణ చేసింది. 1987లో ఐఎన్ఎస్ఏ ఆమెకు కెఆర్
రామనాథన్ మెడల్ ప్రదానం చేసింది.
అన్నామణి 2001 ఆగస్టు 16న
తిరువనంతపురంలో తుదిశ్వాస విడిచింది. ఆవిడ వందవ జయంతి నాడు డబ్ల్యూఎంఓ ఆమె
జీవితకథను ప్రచురించడం విశేషం.