BHARAT
vs ENGLAND 5th Test : ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరుగుతున్న ఐదో
టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు పై చేయి సాధించింది. భారత టాప్ ఆర్డర్ లో
ఐదుగురు హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ పై
భారత్ 255 పరుగుల ఆధిక్యం సాధించింది.
120 ఓవర్లు ఆడిన భారత్, 8 వికెట్ల నష్టానికి
473 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకే ఆలౌట్ అయింది.
ఓపెనర్లు
యశస్వీ జైస్వాల్(57), రోహిత్ శర్మ(103) రాణించగా శుభ్‌మన్ గిల్(110), దేవ్‌దత్ పడిక్కల్(65),
సర్ఫరాజ్ ఖాన్(56) స్కోర్ బోర్డును పరుగులు
పెట్టించారు.
ఓవర్‌నైట్ స్కోర్ 135/1తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్, శుభ్‌మన్ గిల్ భారీ స్కోర్ కు బాటలు
వేశారు.
తొలి రోజు ఆటలో యశస్వీ జైస్వాల్ ( 57) పరుగుల వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్ లో స్టంప్ ఔట్ గా వెనుదిరిగాడు. ఇక రెండో రోజు ఆటలో
రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లు సెంచరీలు చేశారు.
జట్టు స్కోర్ 104 పరుగుల వద్ద యశస్వీ వికెట్
కోల్పోయిన భారత్, 275 పరుగుల వద్ద రోహిత్ శర్మ(103 ) పెవిలియన్ చేరాడు. బెన్
స్టోక్స్ బౌలింగ్ లోరోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో శుభమన్
గిల్( 110) కూడా వెనుదిరిగాడు.
బషీర్ బౌలింగ్ లోనే సర్ఫరాజ్ ఖాన్(56 )
క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. షోయబ్ బషీర్ వేసిన 84.1 బంతిని ఆడి సర్ఫరాజ్ ఖాన్,
జోరూట్ కు క్యాచి ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అరంగేట్రం
ప్లేయర్ దేవదత్ పడిక్కల్( 65) వికెట్ ను
షోయబ్ బషీర్ తన ఖాతాలో వేసుకున్నాడు. 103 బంతులు ఆడిన దేవదత్, 10 ఫోర్లు, ఒక
సిక్స్ బాదాడు. 403 పరుగుల వద్ద ఐదో
వికెట్ గా దేవదత్ ఔట్ అయ్యాడు.
రవీంద్ర జడేజా, ధ్రువ్ జురైల్, రవిచంద్ర అశ్విన్
మాత్రం తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యారు. టామ్ హార్ట్ లే బౌలింగ్ లో రవీంద్ర జడేజా(
15) ఎల్బీ కాగా, వీకెట్ కీపర్ ధ్రువ్ జురేల్ ( 15) షోయబ్ బషీర్ బౌలింగ్ లో క్యాచ్
ఔట్ గా వెనుదిరిగాడు. వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్, ఐదు బంతులు ఆడి డకౌట్
అయ్యాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి కుల్ దీప్
యాదవ్( 27), జస్ ప్రీత్ బుమ్రా(19) క్రీజులో ఉన్నారు.
ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ నాలుగు వికెట్లు
తీయగా, టామ్ హార్ట్ లే రెండు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్
చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
భారత్ టాప్ ఆర్డర్ హాఫ్ సెంచరీలు చేయడం
టెస్ట్ క్రికెట్ లో ఇది నాల్గోసారి. 1998లో ఐదుగురు భారత టాప్ ఆర్డర్లు 50 పై
చిలుకు పరుగులు చేశారు. కోల్ కతా వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఈ
ఘనత సాధించింది. 1999లో మోహాలీలో న్యూజీ లాండ్ పై , 2009లో ముంబైలో శ్రీలంకపై కూడా
ఇదే ఘనత నెలకొల్పారు. తిరిగి 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ ఫీట్ సాధ్యం కావడంపై క్రికెట్
అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.