కేంద్రంలో
ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. 2014. 2019 ఎన్నికల్లో లాగే, 2024 లో కూడా విజయం సాధిస్తుందని ధీమా
వ్యక్తం చేశారు. దిల్లీలోని భారత మండపం లో ‘నేషనల్ క్రియేటర్స్ అవార్డు’ లను
విజేతలకు అందజేసిన ప్రధాని మోదీ, ‘‘ సామాజిక
మార్పు, పర్యావరణ రక్షణ, విద్య, క్రీడల రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ప్రొత్సహించడమే ఈ
అవార్డులు ఉద్దేశమన్నారు.
మహిళా
దినోత్సవం, శివరాత్రి రోజున అవార్డులను అందజేయడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ
అన్నారు.
ఈ అవార్డుల కోసం 20
విభాగాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1.5 లక్షల
నామినేషన్స్ రాగా వారికి మద్దతుగా పది లక్షల
మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వారి నుంచి 23
మందిని విజేతలుగా ఎంపిక చేశారు.