ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, సతీమణి సుధానారాయణ మూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
సమాజ సేవలో చురుగ్గా ఉండే సుధానారాయణ మూర్తి తెలియని వారుండరు. నారాయణ మూర్తి ఐటీ రంగంలో చెరగని ముద్రవేశారు. ఆయన భార్యగా సుధా నారాయణ మూర్తి సేవా రంగంలో తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. వేల కోట్ల సంపద ఉన్నా, మధ్యతరగతి జీవితాన్ని గడుపుతోన్న సుధా, నారాయణమూర్తి దంపతులు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.