భారత్,
ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న టెస్టులో రోహిత్ సేన అదరగొడుతోంది.
మొదటి రోజు ఆటలో బౌలింగ్ తో సత్తా చాటిన రోహిత్ సేన, రెండో రోజు ఆటలో బ్యాటింగ్ లో
అదరగొడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరూ సెంచరీలు పూర్తి చేశారు.
ఓవర్
నైట్ స్కోర్ 135/1 తో ఆట మొదలు పెట్టిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్ సెంచరీలతో స్కోర్
బోర్డును పరుగులు పెట్టించారు. రెండో రోజు ఆటలో భాగంగా లంచ్ బ్రేక్ సమయానికి భారత్, ఒక వికెట్ నష్టానికి 264 పరుగులు
చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(102*), శుభమన్ గిల్ (101*) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం రోహిత్
సేన, 46 పరుగుల ఆధిక్యంలో ఉంది.
శుభమన్ గిల్ 142 బంతుల్లో 101 పరుగులు చేశాడు. పది
ఫోర్లు, 5 సిక్సులు బాది స్కోర్ బోర్డు వేగాన్ని పెంచాడు. రోహిత్ శర్మ, 160 బంతులు
ఆడి 102 పరుగులు చేశాడు. హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి.
టెస్టుల్లో 12 వ శతకం కొట్టిన రో హిత్, అంతర్జాతీయ క్రికెట్ లో 48వ సెంచరీ చేశాడు.
మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ నిర్దేశించిన 218
పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జైశ్వాల్ అర్థ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు